- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM KCR పై ప్రజా గాయకుడు గద్దర్ సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రజా గాయకుడు గద్దర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నియంతలకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుందని అన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ అనేక పొలిటికల్ ప్రామిసెస్ చేశారని వాటిని గుర్తు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన గద్దర్.. సాధారణంగా రాజకీయ నాయకులు ఆర్థిక పరమైన హామీలు ఇస్తారని కానీ కేసీఆర్ మాత్రం ఉద్యమ సమయంలో రాజకీయ హామీలు ఇచ్చారన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మాట తప్పాడని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ చెబుతున్నాడు. అసలు రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పిన కేసీఆర్.. ఆ విషయాన్ని పక్కన పెట్టి దళిత బంధు స్కీం తీసుకురావడం వెనుక ఆంతర్యం ఏంటని నిలదీశారు. పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలనే డిమాండ్‌ను కేసీఆర్ తన జాతీయ ఎజెండాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆలోచనలు కేసీఆర్ అర్థం చేసుకోవాలని సూచించారు.