- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మాజీ ఎంపీ వివేక్‌కు అక్కడినుంచి సీటు ఫిక్స్..! టీ కాంగ్రెస్ కీలక నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు తనయుడు వంశీ కూడా హస్తం పార్టీలో చేరారు. తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అనంతరం గురువారం ఢిల్లీలో మల్లిఖార్జున ఖర్గేతో వివేక్, వంశీ భేటీ అయ్యారు.
కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఈ ఎన్నికల్లో వివేక్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే దానిపై చర్చ నడుస్తోంది. చెన్నూరు నుంచి వివేక్ పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇక వివేక్ కుమారుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా బరిలోకి దిగుతారని సమాచారం. తొలుత చెన్నూరు టికెట్‌ను వామపక్షాలకు కేటాయించాలని కాంగ్రెస్ భావించింది. కానీ లెఫ్ట్ పార్టీలతో పొత్తు ఖరారు కాకపోవడంతో చెన్నూరు నుంచి వివేక్‌ను పోటీలోకి దింపే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు చెబుతున్నారు.