- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహేశ్వర్ రెడ్డికి షాకిచ్చిన కాంగ్రెస్ పార్టీ
దిశ, తెలంగాణ బ్యూరో: ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పై కాంగ్రెస్‌పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బుధవారం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షో కాజ్ నోటీసులు ఇచ్చింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్నారని, కేవలం గంట లోపు తన వివరణ ఇవ్వాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సూచించింది. దీనిపై మహేశ్వర్‌రెడ్డి ప్రెస్‌మీట్‌పెట్టి వివరాలు ప్రకటిస్తానని గాంధీభవన్‌లోని కొందరు ముఖ్యులకు చెప్పినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, గత కొంత కాలంలో మహేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌పార్టీ యాక్టివిటీస్‌కు దూరంగా ఉంటున్నారు. రేవంత్ వ్యవహరాలు నచ్చక..అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. దీంతోనే ఇటీవల కాంగ్రెస్‌పార్టీ చేసిన ధర్నాలు, నిరసనలు, ఆందోళనల్లో ఎక్కడ పాల్గొనలేదు. రేవంత్ వైఖరి సరిగ్గా లేదని ఢిల్లీ హై కమాండ్‌కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని గతంలో మహేశ్వర్‌రెడ్డి తన సన్నిహిత వర్గాలకు చెప్పినట్లు తెలిసింది.
బీజేపీలో చేరే అవకాశం..?
ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీని మహేశ్వర్ రెడ్డి వీడనున్నట్లు సమాచారం. ఢిల్లీకి వెళ్లి బీజేపీలోకి చేరే అవకాశం ఉన్నట్లు పొలిటికల్వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ మహేశ్వర్‌రెడ్డిపై కాంగ్రెస్ఎలాంటి రెస్పాన్స్ కాలేదు. కానీ బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం అందడంతోనే నోటీసులు ఇచ్చినట్లు గాంధీభవన్‌లోని ప్రచారం జరుగుతున్నది. ఉత్తమ్ మనిషిగా ఏలేటి కి పేరు ఉన్నది. దీంతో నేరుగా ఉత్తమ్బుజ్జగించినా ఏలేటి వినలేదని తెలిసింది.