అసెంబ్లీలో పాపన్నగౌడ్ విగ్రహం పెట్టాలి: మాజీ మంత్రి

by Gantepaka Srikanth |
అసెంబ్లీలో పాపన్నగౌడ్ విగ్రహం పెట్టాలి: మాజీ మంత్రి
X

దిశ, తెలంగాణ బ్యూరో: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం పాపన్నగౌడ్ జయంతిని నిర్వహించారు. పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎవరు కూడా సర్దార్ పాపన్న గౌడ్ జయింతిని నిర్వహించలేదని, తెలంగాణ వచ్చిన తర్వాతనే కేసీఆర్ పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించారన్నారు. గౌడ భవన్‌కు ప్రభుత్వం నిధులు కేటాయించి, దానికి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ట్యాంక్ బండ్‌పై విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. అసెంబ్లీలో కూడా అయన విగ్రహాన్నిపెట్టాలని, బీసీ జనగణనను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు పల్లె రవికుమార్ గౌడ్, ఆంజనేయ గౌడ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, నాయకులు రాంనర్సింహాగౌడ్, రాంమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed