- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మైనార్టీలకు సీఎం కేసీఆర్ చేసింది శూన్యం: మాజీ మంత్రి షబ్బీర్ అలీ
దిశ, తెలంగాణ బ్యూరో: మైనార్టీ సబ్ ప్లాన్‌కు రూ.5 వేల కోట్లు బడ్జెట్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ పేర్కొన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మైనార్టీ సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని, దీనిలో భాగంగానే పవర్‌లోకి రాగానే రూ.5 వేలు కోట్ల నిధులను సబ్ ప్లాన్‌కు కేటాయించనున్నట్లు చెప్పారు. మైనార్టీ డిక్లరేషన్‌లో ఈ అంశాలను పొందుపరుస్తామన్నారు. దీంతో పాటు ముస్లిం రిజర్వేషన్స్ పెంచేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేయనున్నదన్నారు. ప్రస్తుతం ఉన్న 4 శాతాన్ని పెంచుతామన్నారు. ఈ మేరకు లీగల్ ఓపీనియన్లు సేకరిస్తున్నామన్నారు.
స్థలం ఉన్నోళ్లకు ఇల్లు కట్టుకోవడానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం చేస్తామన్నారు. మైనార్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందజేస్తామన్నారు. త్వరలో రాహుల్, ప్రియాంక చేతుల మీదుగా బీసీ, మైనార్టీ డిక్లరేషన్లు విడుదల చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో లక్షల మంది పేద విద్యార్ధులు ఉన్నత చదువులు చదివారన్నారు. ఎంబీబీఎస్, ఇంజినీరింగ్ చదివేందుకు ప్రత్యేక సాయం అందజేశామన్నారు. మైనార్టీలకు కేసీఆర్ చేసింది శూన్యమని అన్నారు. మైనార్టీలకు నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం కోసం రెండు సార్లు అప్లికేషన్లు తీసుకున్నా.. కనీసం ఒక్కరికీ కూడా సహాయం అందించలేదన్నారు.
నా సీటు నిర్ణయించేది వాళ్లే..?
తాను ఎక్కడ్నుంచి పోటీ చేయాలనేది సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయింస్తుందని షబ్బీర్ అలీ తెలిపారు. గురు, శుక్రవారాల్లో థర్డ్ లిస్టు వచ్చే ఛాన్స్ ఉన్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. గెలుపు గుర్రాలను ఎంపిక చేసేందుకు అధిక సమయం పడుతుందన్నారు. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీంచిన తర్వాతనే అభ్యర్ధిని ఎంపిక చేస్తున్నామన్నారు. టిక్కెట్ రాని నేతలు పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలని కోరారు.