- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘CM రేవంత్‌తో ప్రాణహాని ఉంది’.. కాంగ్రెస్ మాజీ మంత్రి సంచలన ఆరోపణలు
దిశ, వెబ్‌డెస్క్: రేవంత్ రెడ్డి తీరుతో కాంగ్రెస్‌లో మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని గత కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు చేస్తోన్న మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు మరోసారి సీఎంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ వల్ల మాదిగలు 50 ఏళ్లు వెనక్కి వెళ్లారని ఫైర్ అయ్యారు. డబ్బులకు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు అమ్ముకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రేవంత్ రెడ్డి అంటే ఏంటో ప్రజలకు అర్థమైందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉండి అక్రమంగా కోట్లు సంపాదించిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని మోత్కుపల్లి సంచలన ఆరోపణలు చేశారు.
రేవంత్ వల్ల తనకు ప్రాణహాని ఉందని అనుమానం వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని మోత్కుపల్లి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాగా, తెలంగాణలోని మూడు ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంట్ స్థానాల్లో మూడు టికెట్లను కాంగ్రెస్ పార్టీ మాల అభ్యర్థులకే కేటాయించింది. మాల కంటే మెజార్టీ జనాభా ఉన్నా మాదిగలకు ఒక్క ఎంపీ టికెట్ కూడా కేటాయించకపోవడంతో కాంగ్రెస్‌పై మాదిగ సామాజిక వర్గం గుర్తుగా ఉంది. ఈ నేపథ్యంలో మోత్కుపల్లి నర్సింహులు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వల్లే మాదిగలకు టికెట్ దక్కలేదని మండిపడుతున్నారు.