పెళ్లిరోజున భార్యకు కేటీఆర్ BIG సర్‌ప్రైజ్

by GSrikanth |   ( Updated:2023-12-23 06:23:52.0  )
పెళ్లిరోజున భార్యకు కేటీఆర్ BIG సర్‌ప్రైజ్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇవాళ తన 20వ పెళ్లిరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పలువురు విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఆసక్తికర ఫొటో షేర్ చేశారు. తన పెళ్లినాటి ఫొటోను పోస్టు చేశారు. ‘‘నా అందమైన భార్య శైలిమకు 20వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. గత రెండు దశాబ్దాలుగా నాకు మద్దతుగా నిలిచినందుకు, నాకు ఇద్దరు అందమైన పిల్లలు ఇచ్చినందుకు, ఈ ప్రయాణంలో గొప్ప భాగస్వామిగా ఉన్నందుకు ధన్యవాదాలు. మన బంధం ఇలాగే కొనసాగాలని కోరుతూ..’’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఆయన ట్వీట్‌కు నెటిజన్లు రీట్వీట్ చేస్తున్నారు. విషెస్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story