కాంగ్రెస్ నేతలకు భయం మొదలైంది: మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

by GSrikanth |
కాంగ్రెస్ నేతలకు భయం మొదలైంది: మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలన్న కాంగ్రెస్ నేతల ఫిర్యాదుపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీలు గుది బండలు అయ్యాయని కాంగ్రెస్ నేతలకు భయం మొదలైందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని నడపలేక బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలని లేఖలు రాస్తున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే ఉలుకెందుకు అని మండిపడ్డారు. ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చారని తాము ముందే చెప్పామని ఎద్దేవా చేశారు. ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకపోతే తెలంగాణ ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారని అన్నారు.

Next Story

Most Viewed