- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ కీలక, మాజీ మంత్రి హరీష్ రావు శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల వేళ మేనిఫెస్టోల పేరుతో కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇస్తోందని విమర్శించారు. హామీలు గుప్పించి విస్మరించడం కాంగ్రెస్‌కు అలవాటే అని అన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చినట్లు మరోసారి పార్లమెంట్ ఎన్నికల వేళ దేశ ప్రజలను మోసం చేయొద్దు అని హితవు పలికారు. గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకొని ఎంపీ టికెట్లు ఇస్తున్నారని గుర్తుచేశారు. కాగా, రాహుల్ గాంధీ రేపు తెలంగాణకు రానున్నారు. తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు. ఈ సభా ఏర్పాట్లను ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు పరిశీలించారు.