- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లక్షల మందితో బీఆర్ఎస్‌లో చేరితే నమ్మక ద్రోహం చేశారు: Ponguleti Srinivas Reddy
దిశ, ఖమ్మం బ్యూరో: అధికారమదంతో కొందరు తనను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని.. మీ అభిమానం ఉన్నంత వరకు శీనన్నను ఎవరూ ఏమీ చేయలేరని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం మధిర నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం బోనకల్ లో నిర్వహించగా.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యఅథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా మీరందరూ ఉన్నంతవరకు తాను ఒంటిరివాడిని కాదని అన్నారు. జిల్లాలోని కొందరు ముఖ్యులతో పాటు బీఆర్ఎస్ పెద్దలు సైతం తనపై కుట్రలు పన్నారని ఆరోపించారు.
వైఎస్ఆర్ సీపీలో ఉన్న తాను బీఆర్ఎస్ పార్టీ పెద్దల మాట విని వందల మంది ముఖ్యనాయకులు, వేలమంది అనుచరులు, లక్షల మంది కార్యకర్తలతో బీఆర్ఎస్ పార్టీలో చేరితే నమ్మక ద్రోహం చేశారన్నారు. పార్టీలో చేరక ముందు ఇచ్చిన వాగ్దానాలను పార్టీలో చేరిన తర్వాత నెరవేర్చలేదని, తద్వారా నన్ను నమ్ముకున్న ఎంతో మంది నాయకులకు అన్యాయం జరిగిందన్నారు. అంతేకాక చేతకాక, ప్రజాభిమానం పొందలేని కొందరి ఓటమికి నేను కారణమనే నెపం నెట్టి టికెట్ ఇవ్వలేదన్నారు. అంతేకాదు.. వేరేపార్టీకి చెందిన ఓ వ్యక్తిని గులాబీ పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చి మోసం చేయడమే కాకుండా.. పార్టీ తప్పకుండా చూసుకుంటుందని చెప్పి మాయమాటలు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలిటిక్స్ లోకి వచ్చిన కొత్తలో శీనన్న ఎవరో పూర్తిగా తెలియకుండానే బ్రహ్మరథం పట్టారని.. ఇప్పుడు కూడా అదే అభిమానం చూపడం సంతోషంగా ఉందన్నారు. ఏది ఏమైనా మీఆశీర్వాదాలు తప్పక ఉండాలని కోరారు.
READ MORE
ముత్తిరెడ్డికి ఎసరు!.. జనగామపై బీఆర్ఎస్ మైండ్ గేమ్..?
రాబోయే కురుక్షేత్రంలో మీరు కొట్టుకుపోవడం ఖాయం: పొంగులేటి సంచలన వ్యాఖ్యలు