అది యాధృచ్చిక కలయికే.. క్లారిటీ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే

by GSrikanth |
అది యాధృచ్చిక కలయికే.. క్లారిటీ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారత్ రాష్ట్ర సమితికి చెందిన మహిళా నాయకురాళ్ళతో కలిసి దిగిన ఫోటో సామాజిక మాధ్యమాలలో ప్రచారమవుతుండడంపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పద్మావతి వివరణ ఇచ్చారు. బెంగుళూరులో ఉంటున్న తండ్రిని కలవడానికి వెళ్తున్న సమయంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టులో వారు లాంజ్‌లో కలిశారని ఆ వివరణలో పేర్కొన్నారు. ఢిల్లీలోని నివాసంలో కలిసినట్లుగా పత్రికల్లో, సోషల్ మీడియాలో ప్రచారం జరగడాన్ని ఆమె ఖండించారు.

“కొందరు బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్ళతో నా ఫోటో పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను బెంగళూరు పోతూ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో వెయిటింగ్ లాంజ్‌లో వారు నన్ను కలిశారు. అక్కడ తీసుకున్న ఫోటో అది. దీన్ని అందరూ గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’ అంటూ ఆ వివరణలో పేర్కొన్నారు. ఎయిర్ పోర్టులో తాను బెంగుళూరుకు వెళ్ళడానికి లాంజ్ లో వెయిట్ చేస్తున్న సమయంలోనే వారు కూడా అక్కడకు వచ్చారని, ఆ సందర్భంలో అందరం కలిసి గ్రూపు ఫొటో దిగినట్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story