- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
1.30 లక్షల మందితో ధర్నా చేస్తాం.. కాంగ్రెస్ సర్కార్ KCR వార్నింగ్
X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సర్కార్‌కు బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేవేళ్లలో బీఆర్ఎస్ శనివారం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. దళితవాడలు ధనికవాడలు కావాలని ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకం చేపట్టామని తెలిపారు. చివర్లో 1.30 లక్షల మందికి బీఆర్ఎస్ ప్రభుత్వం దళితబంధు మంజూరు చేసిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ మంజూరు చేసిన డబ్బులను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆపేసిందన్నారు. దళితబంధు త్వరగా ఇవ్వకుంటే ఎంపిక చేసిన లబ్దిదారులతో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తానని హెచ్చరించారు. ప్రజలు మౌనంగా ఉండకుండా పోరాడి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన విదేశీ విద్య స్కాలర్ షిప్‌లను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement
Next Story