సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు కన్నుమూత

by Satheesh |
సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంలో బాధపడుతోన్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ కన్నూమూశారు. విజయరామారావు మృతి పట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఆయన.. 1991-96 మ‌ధ్య దేశ ప్రధానిగా పీవీ న‌ర్సింహారావు హ‌యాంలో సీబీఐ డైరెక్టర్‌గా ప‌ని చేసి రిటైర్ అయ్యారు. 1999‌లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయరామారావు మంత్రిగాను పని చేశారు.

Advertisement

Next Story