Flood managements Committes: ఫ్లడ్ మేనే‌జ్‌మెంట్ కమిటీలు!

by Shiva |   ( Updated:2024-09-04 15:52:05.0  )
Flood managements Committes: ఫ్లడ్ మేనే‌జ్‌మెంట్ కమిటీలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో గ్రామాలు, మండలాల వారీగా ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. మంత్రి సీతక్క జిల్లా అయిన ములుగులో ఇది విజయవంతమైన నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయని అంచనా వేస్తున్నది. అయితే ముందుగా గ్రామాల్లోని చెరువులు, వాగులు, కాలువలపై వెల‌సిన అక్రమ కట్టడాల విష‌యంలో ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై మంతనాలు జరుపుతున్నది. ఈ విషయంపై నేడు సచివాల‌యంలో మంత్రి సీతక్క పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ ఉన్నతాధికారుల‌తో సమీక్షించనున్నారు. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో శాఖ‌ల వారీగా చేప‌ట్టాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేయనున్నారు. పారిశుధ్య నిర్వహణ, తాగు నీటి స‌ర‌ఫ‌రా, రాక‌పోక‌ల పునరుద్ధరణ ప్రణాళికలపై చర్చించనున్నారు. వీలైనంత త్వరగా ప‌నులు పూర్తి చేసేలా కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించేందుకు ఈ సమీక్ష ఏర్పాటు చేసినట్టు మంత్రి కార్యాలయవర్గాలు స్పష్టం చేశాయి.

Advertisement

Next Story