- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి కన్నుమూత
దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి రిటైర్డ్ జడ్జి తొట్టాటిల్ భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్ (63) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కేరళ కొచ్చిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కేరళ, కలకత్తా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తి భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్ పనిచేశారు.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోని ప్రత్యేక హైకోర్టుకు మొదటి ప్రధాన న్యాయమూర్తిగా రాధాకృష్ణన్ పని చేశారు. 2019 జనవరిలో తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా అప్పటి గవర్నర్ నరసింహన్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా రాధాకృష్ణన్ కొన్ని నెలలు మాత్రమే ఉన్నారు. రాధాకృష్ణన్ కేరళ రాష్ట్రంలోని కొల్లాంలో 1959 ఏప్రిల్ 29న జన్మించారు. అక్కడే పాఠశాల విద్య పూర్తి చేసుకున్నారు. తిరువనంతపురంలో 1983లో న్యాయవాదిగా తన కెరీర్ ప్రారంభించారు.
సివిల్, కాన్‌స్టిట్యూషనల్, అడ్మినిస్ట్రేటివ్ లాస్ అనే మూడు విభిన్న న్యాయ శాఖలలో ప్రాక్టీస్ చేశారు. ఐదు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌గాను పనిచేశారు. అక్టోబరు 14, 2004న కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 12 సంవత్సరాలు(2004 నుండి 2017 వరకు) కేరళ హైకోర్టు న్యాయమూర్తిగాను, రెండుసార్లు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా రాధకృష్ణన్ పనిచేశారు. దీంతోపాటు కేరళ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ప్యాట్రన్-ఇన్-చీఫ్‌గా కూడా వ్యవహరించారు. 12 ఏళ్ల కేరళ హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేసిన తర్వాత కోల్‌కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు.