- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘సిగ్గుచేటు’.. హైదరాబాద్ ఓటర్లపై సినీనటి మంచు లక్ష్మి ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ ప్రారంభం కాగా.. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు లైన్ కట్టారు. పోలింగ్ మొదలైన తొలి రెండు గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 9.48 ఓటింగ్ పర్సంటేజ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. అయితే, అత్యల్పంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఓటింగ్ శాతం నమోదైనట్లు ఈసీ తెలిపింది. హైదరాబాద్‌లో ఓటింగ్ మందకొడిగా సాగడంతో హైదరాబాద్ ఓటర్లపై సినీనటి మంచు లక్ష్మి ఫైర్ అయ్యారు.
హైదరాబాద్ సిటీలో ఇప్పటి వరకు 5 శాతమే ఓట్లు నమోదు కావడం సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను కేవలం ఓటు హక్కు వినియోగించుకోవటం కోసం ముంబై నుంచి వచ్చానని.. కానీ, హైదరాబాద్‌లో ఉన్నవారు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇంటి నుండి కూడా బయటికి రాకపోవడం దారుణమని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నగర ప్రజలు బయటికి వచ్చి ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు