ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఆ గడువును పెంచుతూ ఇంటర్ బోర్డు నిర్ణయం

by Mahesh |
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఆ గడువును పెంచుతూ ఇంటర్ బోర్డు నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 24 తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయగా.. మొదటి సంవత్సరంలో 60.01 శాతం, సెకండియర్ లో 64.19 శాతం ఉద్యార్తులు ఉత్తీర్ణత సాధించారు. కాగా ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 24 నుంచి జూన్ 3 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా ఈ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు గడువు ఈ రోజుతో ముగియనుండగా.. విద్యార్థుల కోరిక మేరకు మే 4 వరకు ఫీజు చెల్లింపుకు ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. రాగా మే 24 నుంచి జరగనున్న ఈ సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం ఫస్టియర్, మధ్యాహ్నం సెకండ్ ఇయర్ విద్యార్థులకు నిర్వహించనున్నారు.

Advertisement

Next Story