ఆ అంశపైనే సెలక్షన్ డిపెండ్.. కొత్త పీసీసీపై ఉత్కంఠ..!

by Rajesh |
ఆ అంశపైనే సెలక్షన్ డిపెండ్.. కొత్త పీసీసీపై ఉత్కంఠ..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. సొంత పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష లీడర్లు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్ని కులాల నుంచి పోటీ నెలకొనడంతో ఎంపిక కష్టంగా మారిందని ఏఐసీసీ నేతలు చెబుతున్నారు. అయితే మంత్రి వర్గ విస్తరణను బట్టి పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ఆధారపడి ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. కేబినెట్ విస్తరణలో క్యాస్ట్, డిస్ట్రిక్ట్ ఈక్వేషన్స్ తేలిన తర్వాతనే పీసీసీ ప్రెసిడెంట్‌ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేబినెట్‌లో సరైన ప్రాతినిథ్యం లేని కులాలకు పీసీసీగా అవకాశం ఇవ్వొ చ్చనే చర్చ జరుగుతోంది.

ప్రధాన రేసులో ఉన్నోళ్లు వీళ్లే..?

పీసీసీ రేసులో ప్రధానంగా బీసీ సామాజిక వర్గం నుంచి మహేష్‌కుమార్ గౌడ్, మధుయాష్కీ గౌడ్ ఉన్నా రు. మరోవైపు ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్ పేరు కూడా బలంగానే వినిపిస్తోంది. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయనకు ఏఐసీసీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో కొందరు ఏఐసీసీ నేతలు ఆయన పేరును ప్రతిపాదించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆయనకు పీసీసీ ఇవ్వడం వల్ల పార్టీ యాక్టివిటీస్, కో ఆర్డినేషన్ సులువుగా జరుగుతుందనే చర్చ జరుగుతోంది. పైగా కేబినెట్‌లో లంబాడా సామాజిక వర్గం నుంచి ప్రాతినిథ్యం లేదు. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, అడ్లూరి లక్ష్మణ్ పేర్లు వినిపిస్తున్నాయి. కేబినెట్‌లో గడ్డం వివేక్‌కు అవకాశం కల్పిస్తే, పీసీసీగా మాదిగకు ఇవ్వాలనే ప్రపోజల్ తెర మీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో వీళ్లద్దరిలో ఒకరిని సెలక్ట్ చేసుకునే చాన్స్ ఉంది. ఇక రెడ్డి కోటాలో వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా ట్రై చేస్తున్నట్లు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed