NTR: ‘వార్-2’ మూవీ సెట్స్ నుండి లీక్ అయిన ఎన్టీఆర్ లుక్.. నెట్టింట వైరల్

by Hamsa |
NTR: ‘వార్-2’ మూవీ సెట్స్ నుండి లీక్ అయిన ఎన్టీఆర్ లుక్.. నెట్టింట వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్(NTR) వరుస సినిమాలతో దూసుకుపోవడంతో పాటు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల తారక్ ‘దేవర’(Devara) మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రజెంట్ ప్రశాంత్ నీల్‌(Prashanth Neel)తో ఓ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టారు. అంతేకాకుండా ఎన్టీఆర్ ‘వార్-2’ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. అయితే దీనిని అయాన్ ముఖర్జీ(Ayan Mukherjee) తెరకెక్కిస్తుండగా.. ఇందులో హృతిక్ రోషన్(Hrithik Roshan) హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ గెస్ట్ రోల్ చేస్తున్నారు.

అయితే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా, ‘వార్-2’(War-2) సినిమా సెట్‌ నుంచి ఎన్టీఆర్(NTR) లుక్ లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీ షర్ట్, డెనిమ్ జాకెట్, కార్గో ప్యాంట్ తో ఉన్న తారక్ పిక్ ఒకటి అందరినీ ఫిదా చేస్తుంది. కాగా, వార్-2(War-2) మూవీ వచ్చే ఏడాది ఆగస్టు 14న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ప్రజెంట్ హృతిక్ రోషన్(Hrithik Roshan) ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకుల ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Advertisement

Next Story