సోమశిల-శ్రీశైలం లాంచీ ప్రయాణం - ప్యాకేజీ ఎంతంటే..?

by Naveena |
సోమశిల-శ్రీశైలం లాంచీ ప్రయాణం - ప్యాకేజీ ఎంతంటే..?
X

దిశ, కొల్లాపూర్: నల్లమల అటవీ ప్రాంతం, కొండకోనల మధ్య కృష్ణా నదిలో విహారానికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ సిద్ధమైంది. పర్యాటకులను కనువిందు చేస్తూ కృష్ణానది అలలపై విహారిస్తూ.. చేసే ప్రయాణం జీవితంలో మరుపురాని ఘట్టంగా చెప్పవచ్చు. తెలంగాణ లో టూరిజం అభివృద్దికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నల్లమలలోని సోమశిలలో మంత్రి పర్యటించి, టూరిజం శాఖకు సంబంధించిన లాంచీ, కాటేజీలను పరిశీలించారు. మంత్రి జూపల్లి లాంచీ డ్రైవింగ్ చేస్తూ.. సంబంధిత అధికారులతో కృష్ణానదిలో విహారించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ఆహ్లాదకరమైన వాతావరణంలో కృష్ణమ్మ అలల ఒడిలో కనువిందు చేస్తూ..పర్యాటకుల కోసం సోమశిల నుంచి శ్రీశైలం వరకు ఏసీ లాంచీ సిద్దగా ఉందన్నారు. రెండు కొండల మధ్య చుట్టూ ఎత్తైన కొండలు నల్లమల అడవులు వివిధ వన్యప్రాణులు చూస్తూ.. ప్రయాణం చేస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ లాంచీ ప్రయాణం పర్యాటకుల హృదయాలను కట్టిపడేస్తాయని మంత్రి జూపల్లి వెల్లడించారు. తెలంగాణలో పర్యాటక ప్రదేశాలను మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఆ దశగా చర్యలు చేపట్టిందన్నారు. నాగార్జునసాగర్, కిన్నెరసాని పర్యాటక ప్రాంతాలను అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. సోమశిల టూ శ్రీశైలం లాంచీ ప్రయాణానికి పర్యాటకులు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలని మంత్రి సూచించారు. శ్రీశైలం వరకు పర్యాటక ప్రాంతాలను పర్యాటకులు వీక్షిస్తూ.. లాంచీలో ప్రయాణం చేస్తారని ఆయన పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతాలను అభివృద్ది చేయడమే ప్రభుత్య లక్ష్యమని మంత్రి జూపల్లి అన్నారు.

టూరిజం ప్యాకేజీ వివరాలు ఇవే...

సోమశిల-శ్రీశైలం లాంచీ ప్రయాణం ప్యాకేజీ వివరాలను టూరిజం శాఖ అధికారులు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను పర్యటశాఖ ఉన్నతాధికారులు జారీ చేశారు..ప్రయాణానికి పెద్దలకు రూ.3వేలు, చిన్నారులకు రూ.2,400లు,ఏసీ లాంచీలో ప్రయాణానికి చిన్నపిల్లలకు, పెద్దలకు వేర్వేరుగా టికెట్ల ధరలను నిర్ణయించారు. వన్ వే ప్రయాణానికి పెద్దలకు రూ2 వేలు,చిన్నపిల్లలకు రూ,1,600 లు. రాను పోను ప్రయాణానికి పెద్దలకు రూ,3వేలు, చిన్నపిల్లలకు రూ,2,400లు, టికెట్ ధరలు నిర్ణయించారు. ప్రయాణికులకు మధ్యాహ్నం భోజన వసతి కల్పించనున్నారు. శనివారం నుంచి ఆన్ లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు...లాంచీ ప్రయాణ వివరాలు, టికెట్ల బుకింగ్ కు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు మొబైల్ నంబర్ 7731854994 లో సంప్రదించవచ్చు.

Advertisement

Next Story

Most Viewed