Kaushik Reddy: యాదాద్రి ఫొటో షూట్‌పై MLA కౌశిక్ రెడ్డి వివరణ

by Gantepaka Srikanth |
Kaushik Reddy: యాదాద్రి ఫొటో షూట్‌పై MLA కౌశిక్ రెడ్డి వివరణ
X

దిశ, వెబ్‌డెస్క్: తన సతీమణి శాలినితో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Padi Kaushik Reddy) యాదాద్రి(Yadadri) ఆయలంలో చేసిన ఫొటో షూట్ వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఫొటో షూట్‌పై కౌశిక్ రెడ్డి వివరణ ఇచ్చారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘యాదగిరి గుట్ట టెంపుల్ బయట మేము ఫొటో షూట్ చేశాము. ఈవో పర్మిషన్ తీసుకున్నాకే ఫొటో షూట్ తీశాము. కేసీఆర్ కట్టించిన యాదాద్రి టెంపుల్ ప్రపంచానికి తెలియాలనే చేశాము’ అని కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) అన్నారు. ప్రభుత్వ పెద్దలు ముందు పాలనపై ఫోకస్ చేయాలని సూచించారు. అసలు తెలంగాణను కాంగ్రెస్ ఏం చేయాలనుకుంటోందని ప్రశ్నించారు. సీఎం రేవంత్(CM Revanth Reddy) సహా మంత్రులంతా అయోమయంలో ఉన్నారని విమర్శించారు.

సీఎం ఢిల్లీ, కేరళ టూర్లు తిరుగుతున్నారు. మంత్రులు పొంగులేటి, పొన్నం కొరియాకు వెళ్లారు. మంత్రి తుమ్మల మలేషియా టూర్ వెళ్లగా.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెలికాప్టర్ కోసం గొడవ పడుతున్నారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రశ్నించారు. ప్రజలు అధికారం ఇచ్చింది దీనికోసమేనా? అని ప్రశ్నించారు. హామీలు అమలు చేయకపోతే తెలంగాణ ప్రజలు సహించరు అని అన్నారు. ఓటు ద్వారా ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని తెలిపారు. తెలంగాణ పైసలు వయనాడ్‌కు హెలికాఫ్టర్‌లో తీసుకువెళ్లి ప్రియాంకా గాంధీకి ఇచ్చి వస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏ అధికారి ఓవర్ యాక్షన్ చేసినా వారి పేర్లు రాసుకుంటాం. తెలంగాణకు మళ్లీ సీఎం అయ్యేది కేసీఆరే. తాము అధికారంలోకి వచ్చాక వారందరి సంగతి చెబుతామని కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed