- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Srikanth Goud: లొంగిపోయిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు
దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) సోదరుడు శ్రీకాంత్ గౌడ్(Srikanth Goud) శుక్రవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని క్రిస్టియన్ పల్లి శివారు 523 సర్వే నెంబర్‌లో ఉన్న ప్రభుత్వ భూమిని తప్పుడు ధ్రువీకరణ పత్రాలు, సంతకాలతో ప్లాట్లుగా చేసి విక్రయాలు జరిపిన వ్యవహారంలో మొత్తం నలుగురిపై మహబూబ్ నగర్ రూరల్ పోలీసులు రెండు నెలల క్రితం కేసులు నమోదు చేశారు. ముగ్గురిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.
మరో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) సోదరుడు శ్రీకాంత్ గౌడ్.. బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) స్వయంగా తన సోదరుడు శ్రీకాంత్ గౌడ్(Srikanth Goud)ను తన వాహనంలో తీసుకొచ్చి రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద దించారు. కాగా శ్రీకాంత్ గౌడ్ లొంగిపోతున్న విషయం తెలుసుకొని పలువురు బీఆర్ఎస్ నాయకులు రూరల్ పోలీస్ స్టేషన్కు వచ్చి శ్రీకాంత్ గౌడ్‌ను కలిసి పలు అంశాలపై చర్చించారు.