ఈ పరీక్షలను వెంటనే వాయిదా వేయాలి..!

by Anjali |   ( Updated:2023-04-10 11:48:08.0  )
ఈ పరీక్షలను వెంటనే వాయిదా వేయాలి..!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడంతో అభ్యర్థులు హైదారాబాద్ నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ముందు సోమవారం ఆందోళనకు దిగారు. ఈ నెల (ఏప్రిల్) 23, 24వ తేదీల్లో జరిగే ఏఈవో, ఏఎంవీఐ పరీక్షలు వెంటనే వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకైనట్లు తమకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు పరీక్ష వాయిదా వేసి ప్రశ్రాపత్రం మార్చాలని ఆందోళన చేపడుతున్నారు. అయితే అభ్యర్థులు ఆందోళనను తీవ్రతరం చేయడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు అడ్డుకున్నారు.

Advertisement

Next Story