TG Inter Exams: వాచ్ కూడా అనుమతి లేదు.. తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు కీలక నిబంధనలు

by Ramesh N |
TG Inter Exams: వాచ్ కూడా అనుమతి లేదు.. తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు కీలక నిబంధనలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఇంటర్మీడియట్ (Inter Exams) పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. (Telangana State Board of Intermediate Education) నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయంలో సోమవారం బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య, అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సెక్రటరీ మాట్లాడుతూ.. ఎల్లుండి (మార్చి 5) నుంచి ఈ నెల 25 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు 8:45 కి పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని కీలక సూచనలు చేశారు. 8:45 వరకు కేంద్రానికి చేరుకుంటే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇస్తాం.. కానీ ఆ అవకాశం రాకుండా విద్యార్థులు చూసుకోవాలని, ముందుగా వస్తే విద్యార్థులకు సేఫ్ ఉంటదని తెలిపారు. ముందుగా వస్తే విద్యార్థులకు టైం ఉంటుందని, ఓఎంఆర్ షీట్ ఫీల్ చేసుకొనే అవకాశం ఉంటుందని చెప్పారు.

పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని కీలక నిబంధనలు తెలిపారు. ముఖ్యంగా ఎలాంటి రకమైన వాచ్ కూడా అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ప్రశ్న పత్రాలు పోలీస్ ఎస్కార్ట్‌తో సెంటర్‌కి చేరుతాయని అన్నారు. హాల్ టికెట్ మీద లొకేషన్ క్యూ ఆర్ కోడ్ ఉంటుందని, ముందు రోజే ఎగ్జామ్ సెంటర్ చూసుకుంటే విద్యార్థులకు ఇబ్బందిగా ఉండదని సూచించారు. స్ట్రాంగ్ రూమ్‌కి మెటీరియల్ పంపించామని, జిల్లాలో కలెక్టర్, ఎస్పీ అందరితో మీటింగ్ జరిగిందని వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా 1532 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 9,96,971 మంది ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు వెల్లడించారు. 29,992 మంది ఇన్విజిలేటర్లు, 1532 డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, 1532 పరీక్ష పర్యవేక్షకులు చీఫ్ సూపరింటెండెంట్స్, 72 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 124 సిటింగ్ స్క్వాడ్స్‌తో పర్యవేక్షణ చేయనున్నట్లు పేర్కొన్నారు. నాంపల్లి ఇంటర్ బోర్డులో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయని వెల్లడించారు. పరీక్ష కేంద్రంలో సెంటర్‌ని బట్టి 5 నుంచి 6 సీసీ కెమెరాలు ఉంటాయన్నారు. పరీక్ష సమయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, టీజీపీఎస్సీ గైడ్ లైన్స్ ప్రకారం పరీక్షలు నిర్వహిసున్నామని కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story

Most Viewed