బీఆర్ఎస్ నుండి అందుకే వెళ్లగొట్టారు.. ఎట్టకేలకు అసలు విషయం బయటపెట్టిన ఈటల

by Satheesh |   ( Updated:2023-11-21 14:16:40.0  )
బీఆర్ఎస్ నుండి అందుకే వెళ్లగొట్టారు.. ఎట్టకేలకు అసలు విషయం బయటపెట్టిన ఈటల
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నుండి తనను వెళ్లగొట్టడంపై బీజేపీ కీలక నేత, హుజురాబాద్, గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్ కాలనీలో ఈటల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం పదవికి పోటీగా వస్తున్నాననే సీఎం కేసీఆర్ తనను బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్లగొట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్‌కు సవాల్ చేసి హుజురాబాద్‌లో గెలిచి చూపించానని అన్నారు.

ఈ సారి గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని ఈటల జోస్యం చెప్పారు. మల్లన్న భూ నిర్వాసితులను పట్టించుకోని వాళ్లే.. నాపై పోటీ చేసే దమ్ము లేక బీజేపీని రానివ్వొద్దు అంటున్నారన్నారు. భూ నిర్వాసితులను కేసీఆర్ అడ్డా మీద కూలీలుగా చేశారని మండిపడ్డారు. మీకు బాధ ఉంటే బీఆర్ఎస్‌ను వచ్చే ఎన్నికల్లో బొందపెట్టాలని భూ నిర్వాసితులకు సూచించారు. దౌర్జన్యాన్ని, పోలీసులను నమ్ముకున్న వాళ్లు ఎప్పటికీ బాగుపడరని, తాము బెదిరిస్తే భయపడమని.. మేం ఫైటర్లమని ఈటల అన్నారు.

Advertisement

Next Story