- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Etela Rajender: ఎన్నారైలు గల్లా ఎగరేస్తున్నా ఆయనకు కనిపించడం లేదు
దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నారైలు గల్లా ఎగరేసి తాను భారతీయుడిని అని చెప్పే స్థాయికి ఎదిగితే రాహుల్ గాంధీ మాత్రం దేశాన్ని కించపరిచేలా వ్యాఖ్యానిస్తున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender) ఘాటు విమర్శలు చేశారు. హైదరాబాద్‌లో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై ఆయన ధ్వజమెత్తారు. గతంలో ప్రపంచంలో భారత్ దేశం అంటే థర్డ్ ఓల్డ్ కంట్రీ, పేద దేశం, ఎదుగుతున్న దేశమని, కానీ 10 సంవత్సరాల మోడీ పాలనలో భారతదేశం థర్డ్ ఓల్డ్ కంట్రీ కాదని, ప్రపంచానికి నాయకత్వం వహించే స్థాయికి ఎదిగిన దేశంగా అభివృద్ధి చెందిందని ఈటల వ్యాఖ్యానించారు.
తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఎలక్షన్ కమిషన్(Election Commission) బాగా పనిచేసినట్లు, ప్రజాస్వామ్యం గెలిచినట్లు అంటున్నారని, కానీ ఆ పార్టీ ఓడిపోతే, అధికారంలోకి రాకపోతే ఈవీఎంలను నిందిస్తున్నారన్నారు. కాంగ్రెస్(Congress) ద్వంద్వ వైఖరి ఏంటో ప్రజలకు అర్థమవుతోందన్నారు. దేశంలో ఉన్న కోర్టులు, ప్రజాస్వామ్యం(Democracy), రాజకీయాలపై, ఎన్నికల కమిషన్, ప్రజలపై కూడా విశ్వాసం లేని వ్యక్తి రాహుల్ గాంధీ అని ఈటల పేర్కొన్నారు. ఆయనకు ఇక్కడ మాట్లాడే దమ్ము లేక ఎక్కడో విదేశాలకు వెళ్లి భారతజాతి ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని రాజేందర్ ఫైరయ్యారు. రాహుల్‌కు ఇది తగదని, ఆయన దేశంపై ఎలాంటి వైఖరితో ఉన్నారో ఆయన మాటల్ని బట్టే అర్థమవుతోందని ఈటల ఫైరయ్యారు.