Errabelli Dayakar Rao: ఆరు నెలల్లో ప్రభుత్వం కూలడం ఖాయం.. మరోసారి ఎర్రబెల్లి సెన్సేషనల్ కామెంట్స్

by Shiva |
Errabelli Dayakar Rao: ఆరు నెలల్లో ప్రభుత్వం కూలడం ఖాయం.. మరోసారి ఎర్రబెల్లి సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో దీపావళికి ముందే పొలిటికల్ బాంబు (Political Bombs)లు పేలబోతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping), కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project), ధరణి (Dharani)తో పాటు మొత్తం ఎనమిది నుంచి 10 అంశాల్లో విచారణ (Enquiry) కొనసాగుతోందని అన్నారు. త్వరలోనే నిజానిజాలకు ప్రజల ముందుకు ఉంచబోతున్నాయని మంత్రి పొంగులేటి (Minister Ponguleti) స్టేట్‌మెంట్ ఇచ్చారు.

అయితే, ఆయన వ్యాఖ్యలకు కౌంటర్‌‌గా ఇవాళ మరోసారి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Former Minister Errabelli Dayakar Rao) ఘాటుగా స్పందించారు. త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)లోనే బాంబులు పేలబోతున్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీకి చెందిన నేతలు ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని బాంబు పేల్చారు. వారిపై తాము బాంబులు వేయాల్సిన అవసరం కూడా లేదని.. కాంగ్రెస్ (Congress) వాళ్లే ఒకరిపై ఒకరు బాంబులు వేసుకుంటారని అన్నారు. మరో ఆరు నెలలో వ్యవధిలో ప్రభుత్వం కూలడం ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జోస్యం చెప్పారు.

Advertisement

Next Story