అర్హులైన ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేయాలి డిమాండ్

by Mahesh |
అర్హులైన ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేయాలి డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉండిపోయిన విద్యుత్ శాఖలో పనిచేసే ఆర్టిజన్ల రెగ్యులరైజేషన్ ప్రక్రియను ప్రభుత్వం వెంటనే కంప్లీట్ చేయాలని డిమాండ్ చేస్తూ దక్షిణ డిస్కం హెడ్ క్వార్టర్ ముందు భారీ స్థాయిలో ఆ కార్మికుల జేఏసీ ఆందోళన నిర్వహించింది. ఆర్టిజన్ల కన్వర్షన్ ప్రక్రియను ముగించాలని, అర్హులైన వారిని క్రమబద్ధీకరించాలని, ఆ తర్వాతనే మిగిలిన పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పలు జిల్లాల నుంచి వేలాది మంది పాల్గొన్న ఈ ధర్నాతో మింట్ కాంపౌండ్ ప్రాంతం దిగ్బంధమైంది. నినాదాలతో సచివాలయ పరిసర ప్రాంతమంతా మార్మోగింది. జూనియర్ లైన్‌మెన్, జూనియర్ అసిస్టెంట్, సబార్డినేట్ పోస్టుల్నీ భర్తీ చేయడానికి ముందే ఆర్టిజన్ల సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. కార్మికుల విద్యార్హతలకు అనుగుణంగా పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి రెగ్యులరైజేషన్, పదోన్నతుల కోసం ప్రక్రియను ప్రారంభించాలని జేఏసీ ప్రతినిధులు కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని దక్షిణ డిస్కం యాజమాన్యాన్ని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed