- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లేనిపోని నిందలు చేయడం సరైంది కాదు: ఎమ్మెల్సీ కవిత కరెంట్ కట్స్ ట్వీట్‌కు TSNPDCL స్పందన
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కరెంట్ కట్స్ ఎక్కువ అవుతున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో కరెంట్ కట్.. అధికారిక మీటింగ్‌లో కరెంట్ కట్.. రైతులకు కరెంట్ కట్ అని ట్వీట్ చేశారు. ఈ వ్యవహారంపై టీఎస్‌ఎన్పీడీసీఎల్ ట్విట్టర్ వేదికగా స్పందించింది. నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రతి నెల రెండో శనివారం రోజున విద్యుత్ (మెయింటనెన్స్) సబ్ స్టేషన్‌లో చేస్తూ ఉంటామని, ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని జగిత్యాల సూపరింటెండింగ్ ఇంజనీర్ సత్యనారాయణ తెలిపారు. అందులో భాగంగానే అన్ని ప్రధాన పత్రికలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం అని ప్రకటన ముందుగానే జారీ చేయడం జరిగిందని గుర్తుచేశారు.
జగిత్యాలలో అర్బన్, రూరల్ మండలాల్లో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కార్యక్రమం సమాచారం చేరవేయ్యని కారణంగా తమ విధి నిర్వహణలో భాగంగా విద్యుత్ నిర్వహణ పనులు సబ్ స్టేషన్‌లో మొదలు పెట్టడం జరిగిందని తెలిపారు. సమాచారం ముందు తెలిపితే మెియంటనెన్స్ చేయకుండా మరొక రోజుకు మార్చుకునేవాళ్లమన్నారు. జీవన్ రెడ్డి కార్యక్రమం అని చెప్పగానే వెంటనే లైన్ క్లియరెన్స్ తిరిగి 20 నిమిషాల వ్యవధిలో కరెంట్ ఇచ్చామని తెలిపారు. రైతులకు, అన్ని వినియోగదారులకు అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలిపారు. ఆ దిశలోనే నిరంతరం ఆహర్నిశలు పనిచేస్తున్నామని, లేనిపోని నిందలు విద్యుత్ శాఖపై చేయడం సరైంది కాదని విజ్ఞప్తి చేశారు.