Akunuri Murali: ఇంత ఫకర్ మనిషిని క్యాడర్ ఎలా భరిస్తున్నారు.. కేటీఆర్‌పై ఆకునూరి విమర్శలు

by Ramesh N |
Akunuri Murali: ఇంత ఫకర్ మనిషిని క్యాడర్ ఎలా భరిస్తున్నారు.. కేటీఆర్‌పై ఆకునూరి విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఇటీవల ఓ ప్రముఖ టీవీ చానల్‌‌‌తో ఫేస్ టూ ఫేస్ కార్యక్రమంలో మాట్లాడారు. జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం ఇవ్వలేక నీళ్లు నమిలాడని ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో ఎక్స్ వేదికగా రిటైర్డ్ ఐఏఎస్, విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి(Akunuri Murali) ఆ వీడియోను పోస్ట్ చేశారు. ‘ఈ వీడియోలో జర్నలిస్ట్ కి హ్యాట్స్ ఆఫ్. కేటీఆర్ కుట్ర రాజకీయాలను మంచిగా ఎక్స్‌పోజ్ చేసిండు. దొంగనే దొంగ అన్నట్టు ఉంది. ఇంత ఫకర్ మనిషిని బీఆర్ఎస్ క్యాడర్ ఎట్లా భరిస్తున్నారు అబ్బా, తిమ్మిని బమ్మి చేసి బమ్మిని తిమ్మి చెయ్యడంలో అయ్యా కొడుకులు ఎక్స్‌పర్ట్స్ అబ్బా, మాటల నైపుణ్యాలతోనే తెలంగాణను నాశనం పట్టించిండ్రు’ అంటూ కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ రాసుకొచ్చారు.

ఆకునూరి మురళి వీడియో పోస్ట్ చేయడంతో ఆయన పెట్టిన పోస్టుపై నెట్టింట బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సగం వీడియోలు కాదు.. పూర్తి వీడియో చూడాలని ఆకునూరికి బీఆర్ఎస్ శ్రేణులు కౌంటర్ ట్వీట్వ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed