BRS ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో సోదాలపై ఈడీ కీలక ప్రకటన

by Satheesh |   ( Updated:2024-06-21 15:08:38.0  )
BRS ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో సోదాలపై ఈడీ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహిపాల్ రెడ్డి ఇంట్లో సోదాలపై ఈడీ కీలక ప్రకటన చేసింది. మైనింగ్ పేరుతో మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి అక్రమాలు చేశారని తెలిపింది. మనీలాండరింగ్, హవాలా నేపథ్యంలో సోదాలు జరిపామని, మహిపాల్ రెడ్డి ఫ్యామిలీకి చెందిన సంతోష్ శాండ్, సంతోష్ గ్రానైట్ కంపెనీల ద్వారా అక్రమాలు జరిగాయని వెల్లడించింది. ఈ రెండు కంపెనీల ద్వారా అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని ఈడీ వెల్లడించింది.

మైనింగ్ ద్వారా రూ. 300 కోట్లు అక్రమంగా సంపాదించారని, దీని ద్వారా ప్రభుత్వానికి రూ.39 కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. అక్రమ మార్గాల ద్వారా వచ్చిన డబ్బును సిరాస్థి కొనుగోళ్లలో పెట్టుబడులు పెట్టారని వెల్లడించింది. మధుసూదన్ రెడ్డి, మహిపాల్ రెడ్డికి పలువురు బినామీలు ఉన్నారని, బినామీల పేరుతో లావాదేవీలను గుర్తించామన్నారు. మహిపాల్ రెడ్డి ఇంట్లో సోదాల సందర్భంగా రూ.19 లక్షల నగదు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎమ్మెల్యే ఫ్యామిలీకి చెందిన కొన్ని లాకర్లును సీజ్ చేశామని, వాటిని ఓపెన్ చేయాల్సి ఉందని వివరాలు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed