Ap News: నవంబర్‌ 6న ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే..!

by srinivas |   ( Updated:2024-10-27 10:53:44.0  )
Ap News: నవంబర్‌ 6న ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే..!
X

దిశ, వెబ్ డెస్క్: నవంబర్‌ 6న ఏపీ కేబినెట్(AP Cabinet) భేటీ జరగనుంది. అదే రోజు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన మంత్రులు సమావేశం కానున్నారు. అమరావతి సచివాలయం(Amaravati Secretariat)లో జరగనున్న ఈ భేటీలో పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. సీతాకాల అసెంబ్లీ సమావేశాలపై చర్చించనున్నారని సమాచారం. అలాగే రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్‌పైనా మంత్రులు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్(Finance Minister Payyavula Keshav) ఇప్పటికే బడ్జెట్‌పై కసరత్తులు ప్రారంభించినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు(Assembly Speaker Ayyannapatrudu)తో పాటు ఆర్థిక శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధితో పాటు పలు కంపెనీలకు సంబంధించిన ఆహ్వానాలపైనా ఈ భేటీలో మంత్రులు చర్చించనున్నారు. పలు నిర్ణయాలకు మంత్రులు(Ministers) గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.

Advertisement

Next Story

Most Viewed