ఆ పని చేయలేకపోయాను.. క్రికెట్ ఫ్యాన్స్‌కు, బీసీసీఐకి సారీ చెప్పిన షమీ

by Harish |
ఆ పని చేయలేకపోయాను.. క్రికెట్ ఫ్యాన్స్‌కు, బీసీసీఐకి సారీ చెప్పిన షమీ
X

దిశ, స్పోర్ట్స్ : భారత క్రికెట్ అభిమానులకు, బీసీసీఐకి టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ క్షమాపణలు చెప్పాడు. అనుకున్న సమయానికి ఫిట్‌నెస్ సాధించలేకపోయినందుకు క్షమించాలని కోరాడు. గతేడాది వన్డే వరల్డ్ కప్ తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమైన అతను నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాటికి పునరాగమనం చేస్తాడని అంతా భావించారు. కానీ, అతను పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో ఆస్ట్రేలియాకు టూరుకు ఎంపికవ్వలేదు.


ఈ నేపథ్యంలో షమీ ఆదివారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా జిమ్‌లో చెమటోడుస్తున్న వీడియోను పోస్టు చేస్తూ.. ఎమోషనల్‌గా రాసుకొచ్చాడు. ‘పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నా. బౌలింగ్ ఫిట్‌నెస్‌లో రోజురోజుకూ మెరుగుపడుతున్నా. మ్యాచ్‌కు, దేశవాళీలో రెడ్ బాల్ క్రికెట్ ఆడేందుకు కష్టపడటాన్ని కొనసాగిస్తా. క్రికెట్ అభిమానులకు, బీసీసీఐకి క్షమాపణలు కోరుతున్నా. కానీ, త్వరలోనే రెడ్ బాల్ క్రికెట్ ఆడటానికి నన్ను నేను సిద్ధం చేసుకుంటా.’ అని తెలిపాడు. రంజీ ట్రోఫీలో వచ్చే నెలలో కర్ణాటక‌, మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌ల్లో షమీ ఆడతాడని బెంగాల్ జట్టు వర్గాలు వెల్లడించాయి. ఆ మ్యాచ్‌ల నాటికి ఫిట్‌నెస్ సాధించి, రాణిస్తే ఆస్ట్రేలియా టూరు మధ్యలో కూడా అతన్ని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed