Pranahita river : ప్రాణహిత నదిలో మరో మృతదేహం లభ్యం

by Sridhar Babu |
Pranahita river : ప్రాణహిత నదిలో మరో మృతదేహం లభ్యం
X

దిశ, బెజ్జూర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం ప్రాణహిత నదిలో (Pranahita river)గల్లంతైన ముగ్గురిలో ఒకరి మృతదేహం ఇప్పటికే లభ్యం కాగా ఆదివారం సాయంత్రం మరొకరి శవం లభించింది. దాంతో ముగ్గురిలో ఇద్దరి మృతదేహాలు (2 dead bodies)లభించినట్టయింది. శనివారం బెజ్జూర్ మండలం సోమిని ఎర్రబండ ప్రాణహిత ఓడరేవు వద్దకు ఈత కొట్టడానికి వెళ్లి నదిలో ముగ్గురు గల్లంతయ్యారు. గల్లంతయిన వారిలో జహీర్ హుస్సేన్, ఇర్షాద్ హుస్సేన్ శవాలు ప్రాణహిత తలాయి ఇవ్వడరేవు వద్ద లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మూవీస్ అనే యువకుడి ఆచూకీ ఇంకా లభించలేదు. కాగజ్నగర్ డీఎస్పీ రామానుజన్ ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

Next Story

Most Viewed