సీఎం అభ్యర్థిగా బీజేపీలో సరైన ఎమ్మెల్యే లేరు

by John Kora |
సీఎం అభ్యర్థిగా బీజేపీలో సరైన ఎమ్మెల్యే లేరు
X

- ఆలస్యానికి కారణం అదే

- మాజీ సీఎం ఆతిషి విమర్శలు

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి వారం దాటిపోయినా బీజేపీ ఇంత వరకు సీఎం అభ్యర్థిని ఎంపిక చేయకపోవడానికి కారణం ఏంటో ఆప్ ఎమ్మెల్యే, మాజీ సీఎం ఆతిషి వివరించారు. ముఖ్యమంత్రి పదవిని చేపట్టి, ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపించే సామర్థ్యం ఉన్న ఎమ్మెల్యే గెలిచిన 48 మందిలో ఒక్కరు కూడా లేరనే కారణంతోనే బీజేపీ ఇంకా అభ్యర్థిని ఎంపిక చెయ్యలేదని విమర్శించారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున 48 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే వారిలో ఒక్కరి మీద కూడా ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాకు నమ్మకం లేదని ఆతిషి చెప్పారు. అందుకే కొత్త సీఎంను ప్రకటించడానికి ఇంత ఆలస్యం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఫిబ్రవరి 9నే బీజేపీ తమ ముఖ్యమంత్రిని, కేబినెట్ను ప్రకటించి.. ఆ వెంటనే ఢిల్లీలో అభివృద్ధి పనులను ప్రకటిస్తుందని ప్రజలు ఎదరు చూశారు. కానీ ఇప్పుడిప్పుడే వారికి అంత సామర్థ్యం లేదని అర్థమవుతుందని ఆతిషి దుయ్యబట్టారు. ఢిల్లీలో కనీసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా లేనివారు.. దేశ ప్రజల అభివృద్ధి కోసం ఎలా పని చేస్తారని ఆతిషి ప్రశ్నించారు.

కాగా, ఢిల్లీలో బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఈ నెల 20న ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. తొలుత సోమవారమే లెజిస్లేటీవ్ పార్టీ మీటింగ్ జరుగుతుందని వార్తలు వచ్చినా.. సీఎం అభ్యర్థిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోనందున సమావేశాన్ని వాయిదా వేసినట్లు తెలిసింది. ఢిల్లీ సీఎం పదవికి బీజేపీలో ఆశావహహులు ఎక్కువగా ఉన్నారు. అయితే బీజేపీ మహిళా సీఎం వైపు మొగ్గుచూపుతుందని వార్తలు వస్తున్నాయి.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed