- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. త్వరలోనే 25 వేల పోస్టులకు నోటిఫికేషన్స్: దామోదర

దిశ, డైనమిక్ బ్యూరో: సుప్రీంకోర్టు తీర్పు, రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఎస్సీ వర్గీకరణ సాధ్యం అయిందని మంత్రి దామోదరన రాజనర్సింహ (Minister Damodara Rajanarsimha) అన్నారు. మరో 15-20 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం (SC Classification Act) రాబోతున్నదని.. చట్టం రాగానే 25 వేల పోస్టులతో వివిధ పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్లు (New Jobs Notifications) విడుదల కాబోతున్నదని చెప్పారు. సోమవారం హైదరాబాద్ టూరిజం కన్వెన్షన్ హాల్ లో ఎస్సీ వర్గీకరణపై మాదిగ నేతలతో మంత్రి దామోదర సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక ఆరు నెలల్లోనే 90 శాతం వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. వర్గీకరణ చేసే వరకు నోటీఫికేషన్లు ఇవ్వమని సీఎం చెప్పారని ఇచ్చిన మాటకు కట్టుబడి కొత్తనోటిఫికేషన్లు ఇవ్వలేదన్నారు. వర్గీకరణపై కొంత మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని అందరి అనుమానాలను నివృత్తి చేసే బాధ్యత తమదేనన్నారు.
వర్గీకరణతో అందరి తలరాతలు మారవు:
తెలంగాణ వస్తే మనందరి తలరాతలు మారుతాయని భావించినట్లుగానే ఎస్సీ వర్గీకరణతో సంపూర్ణంగా మాదిగలందరి తలరాతలు మారుతాయనుకోవడం పొరపాటు అన్నారు. వర్గీకరణ వల్ల ఎవరి వాటా కిందా వారికి అడ్మిషన్లు, ఉద్యోగాలు వస్తాయి. కానీ వంద శాతం అందరికీ రావు. మిగతా వారిని ఆదుకోవాల్సిన బాధ్యత గురించి కూడా ఆలోచించాలన్నారు. మనం పోటీ ప్రపంచంలో ఉన్నామని మనందరి ఆలోచనలో మార్పు రావాలన్నారు. ఇప్పుడైనా మనం మేలుకోవాలని లేకపోతే మన పిల్లల భవిష్యత్ దెబ్బతింటుందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని కులాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) జీవితాంతం రుణపడి ఉండాలన్నారు.