Eatala Rajendar: కావాలనే ముత్యాలమ్మ గుడిపై దాడి చేశారు.. ఎంపీ ఈటల హాట్ కామెంట్స్

by Shiva |   ( Updated:2024-10-21 14:17:53.0  )
Eatala Rajendar: కావాలనే ముత్యాలమ్మ గుడిపై దాడి చేశారు.. ఎంపీ ఈటల హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంపై కావాలనే దాడి చేశారని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ (Malkajgiri MP Eatala Rajender) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జరిగిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ.. ఇవాళ ఆయన రాష్ట్ర బీజేపీ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ (Governor Jishnu Dev Varma)కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ముత్యాలమ్మ గుడి (Mutyalamma Temple)పై జరిగిన దాడిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడేందుకు పలు టీమ్‌లు ఇప్పటికే రంగంలోకి దిగాయని ఆరోపించారు.

నిందితులను కఠినంగా శిక్షించాలంటూ నిరసన తెలిపిన స్థానికులపై పోలీసులు దారుణంగా లాఠీచార్జ్ చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం ముత్యాలమ్మ గుడి దాడి ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒక‌వేళ దర్యాప్తు రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాకపోతే కేసును ఎన్ఐఏ (NIA)కు అప్పగించాలని కామెంట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గత కొంతకాలంగా హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లుంబినీ పార్క్ (Lumbini Park), గోకుల్ చాట్ (Gokul Chat) పేలుళ్లలో పదులు సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారని.. నేడు అలాంటి విధ్వంసానికి కొందరు తెర లేపుతున్నారని ఈటల ఫైర్ అయ్యారు. గవర్నర్‌ను కలిసిన వారిలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed