DSC Counseling: సమస్య సాల్వ్.. మరికాసేపట్లో డీఎస్సీ పోస్టింగ్ కౌన్సిలింగ్

by Prasad Jukanti |
DSC Counseling: సమస్య సాల్వ్.. మరికాసేపట్లో డీఎస్సీ పోస్టింగ్ కౌన్సిలింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: డీఎస్సీ పోస్టింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ మరికాసేపట్లో ప్రారంభం కానున్నది. కౌన్సిలింగ్ కు పాఠశాల విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. నిజానికి ఈ కౌన్సిలింగ్ ఇవాళ ఉదయమే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ పోస్టింగ్ కౌన్సిలింగ్ వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో కౌన్సిలింగ్ కోసం జిల్లా విద్యాశాఖ కార్యాలయాలకు వచ్చిన అభ్యర్థులు నిరాశ చెందారు. అయితే కౌన్సిలింగ్ ప్రక్రియలో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో తిరిగి ఇవాళ మధ్యాహ్నం నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.

Advertisement

Next Story