ధరణి ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్‌గా డాక్టర్ మహేష్

by Gantepaka Srikanth |
ధరణి ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్‌గా డాక్టర్ మహేష్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్‌గా డాక్టర్ కొనగాల మహేష్ ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఉద్యోగుల కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కొనగాల మహేష్ మాట్లాడుతూ.. ధరణి పేరుతో కేసీఆర్ కుటుంబ సభ్యులు భూములు దోచుకున్నారన్నారు. కానీ, ధరణి ఉద్యోగులు మాత్రం కేసీఆర్ పాలనలో 11 నెలల జీతాలు లేక పస్తులు ఉన్నారని గుర్తు చేశారు. రాష్ట్ర ఖజానా నుంచి ఒక్కొక్క ఉద్యోగి పేరిట రూ. 29 వేలు చెల్లించగా, థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా కేవలం రూ. 12 వేలు మాత్రమే జీతాలుగా చెల్లించారన్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు కాగానే ఫిబ్రవరి మాసంలో 9 నెలల పెండింగ్ జీతాల బకాయిలను ఒకేసారి చెల్లించామన్నారు.

ధరణి రిజిస్ట్రేషన్లు, ప్రజాపాలన ధరఖాస్తులు, ధరణి స్పెషల్ డ్రైవ్ అప్లికేషన్లు, ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ధరణి ఉద్యోగులను గత ప్రభుత్వం విస్మరించిందన్నారు. డ్యూటీలో చనిపోయిన ఉద్యోగులకు కనీస సాయం అందించలేదన్నారు. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు కూడా మంజూరు చేయలేదన్నారు. ఇంత అమానవీయంగా కేసీఆర్ ప్రభుత్వం ధరణి ఉద్యోగులతో వ్యవహరించిందన్నారు. భవిష్యత్ లో ధరణి ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ధరణి ఉద్యోగ సంఘ నాయకులు పురుషోత్తం, శివ, హిమేష్​ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story