- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్.. బెస్ట్ లీడర్ ఎవరో తెలుసా? సర్వేలో షాకింగ్!
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో గత పదేళ్లుగా పాలన సాగించిన గులాబీ అధిపతి, ఉద్యమ నేత కేసీఆర్‌ను 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఓడించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కేసీఆర్ పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారని ఎన్నికల సమయంలో పలు సర్వేలు తెలిపాయి. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఫలితాలు సైతం వచ్చాయి. కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డికే ప్రజలు పట్టం కట్టారు. 2023, డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఎన్నికల ముందు హామీ ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలు నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారు.
అయితే తెలంగాణ ఉద్యమ నేతగా ప్రజాధరణ ఉన్న కేసీఆర్ గుర్తింపు రాష్ట్రంలో తగ్గుతున్నట్లు కనిపిస్తుంది. స్వరాష్ట్ర ఉద్యమ సమయంలో ప్రజలను ఎంతో చైతన్యం చేసిన కేసీఆర్ నేడు ప్రజాదరణ తగ్గినట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. అయితే తాజాగా ఓ సర్వే ఫలితాలు షాక్‌కు గురిచేశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ఇద్దరిలో బెస్ట్ లీడర్ ఎవరు అని జై స్వరాజ్య టీవీ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో ఇద్దరిలో ఎవరు బెస్ట్ లీడర్ అని యూట్యూబ్‌లో పోలింగ్ పెట్టారు. ఈ సర్వేలో దాదాపు 16 వేల మందికి పైగా పాల్గొన్నారు. ఇందులో కేవలం 2 నెలలకు పైగా పాలన చేసిన రేవంత్ రెడ్డికి 73 శాతం ప్రజలు ఓటు వేశారు. మాజీ సీఎం కేసీఆర్‌కు కేవలం 27 శాతం మాత్రమే ఓట్లు వేశారు. ఉద్యమకాలంలో ఓ వెలుగు వెలిగిన కేసీఆర్ తాను చేసిన అవినీతి వల్లే బెస్ట్ లీడర్ కాలేకపోయారని పొలిటికల్ సర్కిల్లో ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ స్టేట్ చీఫ్ రేవంత్ రెడ్డికి ప్రజాదరణ పెరుగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.