‘రాజకీయాల్లోకి తల్లులను లాగుతావా.. సంజయ్ చిల్లర మాటలు మానుకో’: మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్

by Shiva |
‘రాజకీయాల్లోకి తల్లులను లాగుతావా.. సంజయ్ చిల్లర మాటలు మానుకో’: మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘రాజకీయాల్లోకి తల్లులను లాగుతావా.. బండి సంజయ్ చిల్లర మాటలు మానుకో’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ రేంజ్‌‌లో ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ మాట్లాడిన మాటలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఏ తల్లైనా నవ మాసాలు మోసి బిడ్డను కంటుందని, చెల్లిని అవమానపరిచే విధంగా మాట్లాడటం పద్ధతి కాదని అన్నారు. హుస్నాబాద్ చౌరస్తా‌లో నిలబడి నా తల్లి ఆత్మ క్షోభిస్తుందని మాట్లాడేందుకు నోరెలా వచ్చిందని మండిపడ్డారు.

సంజయ్ ఎంపీగా ఉండి హుస్నాబాద్ నియోజకవర్గానికి ఏం చేశాడో చెప్పాలని సవాల్ విసిరారు. శ్రీరాముడి జన్మ స్థలం గురించి తాను మాట్లాడి ఉంటే.. తాను సజీవ దహనానికైనా సిద్ధమని సవాల్ విసిరారు. తాను పూర్తిగా శాఖాహారినని, దేవుడిని పూజించే వారిలో ఎల్లప్పుడూ ముందుటానని అన్నారు. అదే బండి సంజయ్‌ పొద్దున లేస్తే.. మందు మాంసం లేనిదే బ్రతకడని ఫైర్ అయ్యారు. తాను ఎంపీ గెలిస్తే.. మంత్రి పదవికి రాజీనామా చేస్తావా అంటున్నాడని.. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఓడినందుకు సిగ్గుండాలె అని ధ్వజమెత్తారు.

తనకు సవాల్ విసిరే ముందు సంజయ్ తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సంజయ్ ఒక్కసారి ఎంపీగా గెలిచాడని, అంతకన్నా ముందే తాను ఎంపీ అయ్యానని, ఓ సారి మార్క్‌ఫెడ్ చైర్మన్ అయ్యానని గుర్తు చేశారు. తన దయా, దాక్షిణ్యాల కారణంగానే కాంగ్రెస్ ప్యానెల్‌లో బండి సంజయ్ అర్బన్ బ్యాంక్ డైరక్టర్ అయ్యాడని అన్నారు. ఇప్పటికైనా బండి సంజయ్ తన నోరును అదుపు పెట్టుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ హితవు పలికారు..

Advertisement

Next Story

Most Viewed