బండి సంజయ్ వ్యాఖ్యలను సమర్థించిన డీకే అరుణ

by GSrikanth |
బండి సంజయ్ వ్యాఖ్యలను సమర్థించిన డీకే అరుణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యలపై బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడిన అరుణ.. బండి సంజయ్ వ్యాఖ్యల్లో తప్పు లేదన్నారు. తెలంగాణలోని ఓ నానుడిని సంజయ్ చెప్పారన్నారు. ఈ చిన్న విషయాన్ని బీఆర్ఎస్ రాద్దాంతం చేస్తుందని మండిపడ్డారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి గవర్నర్‌ను తిట్టినప్పుడు ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ కూతురు తప్పా మిగతావాళ్లు ఆడబిడ్డలు కాదా? అని అరుణ నిలదీశారు. కేవలం కవిత ఈడీ విచారణను డైవర్ట్ చేయడానికే బీఆర్ఎస్ ధర్నా కార్యక్రమాలు అని ఆమె ధ్వజమెత్తారు.

Advertisement

Next Story

Most Viewed