- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ACB Investigation: విచారణకు హాజరైన మాజీ మంత్రి కేటీఆర్.. ఏసీబీ అడిగే ప్రశ్నలివే!
దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-రేసు (Formula E-Race) వ్యవహరంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ (ACB) నోటీసులు అందుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఇవాళ విచారణకు హాజరయ్యారు. ఆయన వెంట అడ్వొకేట్ రాంచందర్ రావు (Advocate Ramchander Rao) ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. ఈ మేరకు ప్రత్యేక గదిలో ముగ్గురు అధికారుల సమక్షంలో విచారణ జరగనుంది. అందులో ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితిరాజు (ACB Joint Director Riti Raju), ఏఎస్పీ నరేందర్ (ASP Narender), మరో డీఎస్పీ మాజీద్ ఖాన్ (Majid Khan) కలిసి కేటీఆర్‌కు ప్రశ్నలు సంధించనున్నారు.
మొత్తం విచారణను ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి (ACB Director Tarun Joshi) పర్యవేక్షించనున్నారు. ఇన్విస్టిగేషన్‌లో భాగంగా అధికారులు బిజినెస్ రూల్స్ (Business Rules) ఉల్లంఘటన, హెచ్ఎండీఏ (HMDA) నిధులు దుర్వినియోగం, ఆర్బీఐ (RBI) అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపులపై ప్రధానంగా ప్రశ్నించనున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో నిధులు ఎలా ట్రాన్స్‌ఫర్ చేశారనే విషయంపై ఏసీబీ (ACB) ఫోకస్ పెట్టనుంది. కేటీఆర్ (KTR) విచారణకు మొత్తం 35 ప్రశ్నలతో కూడిన క్వశ్చనేర్ (Questionnaire)ను ఏసీబీ అధికారులు సిద్ధం చేసినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.