- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Chinese Kali Temple: అమ్మవారికి నూడుల్స్ నైవేద్యంగా సమర్పించే టెంపుల్.. ఎక్కడ ఉందంటే?
దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా మనం టెంపుల్ ( Temple )కి వెళ్ళినప్పుడు పండ్లను, పాలను , పొంగల్ ను నైవేద్యంగా పెడుతుంటారు. తీపి పదార్థాలను మన ఇంట్లో తయారు చేసుకుని ముందుగా దేవుడికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. అయితే, మీరు ఎక్కడైనా దేవుళ్ళకు నైవేద్యంగా న్యూడిల్స్ పెట్టడం చూశారా? ఇది వినడానికి షాకింగ్ గా ఉన్నా ఇది నిజం. ఈ టెంపుల్ ఎక్కడ ఉందో తెలుసుకుందాం..
కోల్‌కతాలోని ( Kolkata) ) తాంగ్రాలో.. చైనాటౌన్ లోని కాళీమాత ఆలయంలో ( Chinese Kali Temple ) అమ్మవారికి నైవేద్యంగా నూడుల్స్ పెడతారు. అసలు, ఈ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా నూడుల్స్ పెట్టడమేంటని ఆలోచిస్తున్నారా .. కోల్‌కతాలోని చైనా టౌన్‌కి వెళితే చైనాలోకి అడుగుపెట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే, అక్కడ ఉండేవాళ్లలో చైనీయులే ఎక్కువగా ఉన్నారు. అందుకే, ఈ గుడిని చైనీస్ కాళీమాత టెంపుల్ అని పిలుస్తారు. హిందువులైతే .. అమ్మవారికి నైవేద్యంగా పొంగల్, పులిహోర వంటి ఆహార పదార్ధాలు పెడతారు. ఇక, ఇక్కడ చైనీయులైతే.. నూడుల్స్, పెడతారు. అదే ఈ ఆలయం ప్రత్యేకత. ఆ ఆలయం చుట్టుపక్కల చైనా ప్రజలే ఉంటారు. కానీ, వారు మన సంప్రదాయాలను కూడా గౌరవించి పాటిస్తారు. అటు చైనీయులలా, ఇటు భారతీయుల్లా వ్యవహరిస్తారు.