జిల్లాకో డీసీహెచ్​పోస్టు అప్రూవల్..! హెల్త్​సెక్రటరీ రిజ్వీ రివ్యూ

by Vinod kumar |
జిల్లాకో డీసీహెచ్​పోస్టు అప్రూవల్..! హెల్త్​సెక్రటరీ రిజ్వీ రివ్యూ
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ వైద్య విధాన పరిషత్​విభాగంలో జిల్లాకో డీసీహెచ్(డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్​ఆఫ్​హాస్పిటల్​సర్వీసెస్​)పోస్టు అప్రూవల్ అయింది. కానీ అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నది. డాక్టర్ల ప్రమోషన్ల కోసమే ఈ పోస్టులు క్రియేట్ చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం హెల్త్ సెక్రటరీ రిజ్వీ టీవీవీసీ, టీఎస్​ఎంఎస్​ఐడీసీ ఆఫీసర్లతో ఎంసీహెచ్​ఆర్డీలో రివ్యూ నిర్వహించారు. జిల్లాకో వంద పడకల ఆసుపత్రి, ఆసుపత్రుల్లో అందుతున్న సేవలు, మెరుగు పడాల్సిన వైద్యసేవలపై చర్చించారు. అసెంబ్లీ సెగ్మెంట్ లలో ప్రజాప్రతినిధులు ఒత్తిడి మేరకు వంద పడకల ఆసుపత్రి ఏర్పాట్లను వేగంగా నిర్వహించాలని రిజ్వీ ఆఫీసర్లకు సూచించారు.

గతంలో పది మంది హెడ్ ​ఆఫీస్‌కు ఎటాచ్..

ఉమ్మడి జిల్లాలు వారీగా గతంలో పది మంది డీసీహెచ్​లు ఉండేవారు. 2017 లో ఈ కేడర్​అవసరం లేదని అప్పటి కమిషనర్​పది మందిని హెడ్​ఆఫీస్​కు అటాచ్​చేస్తూ ప్రోగ్రామ్​ఆఫీసర్లుగా విధులు నిర్వర్తించాలని సూచించారు. వీరిలో ఒక్కోక్కరికి నాలుగైదు జిల్లాలు ఇచ్చి సూపర్​వైజింగ్ చేయాలని స్పష్టం చేశారు. ఆ జిల్లాల పరిధిలోని ఏరియా, కమ్యూనిటీ హెల్త్ కేర్​సెంటర్, జిల్లా ఆసుపత్రుల్లో వైద్యసేవలు, అవసరాలు, సమస్యలు వంటివన్ని ఈ ప్రోగ్రామ్​ఆఫీసర్లు మానిటరింగ్ చేస్తూ, ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నారు. ప్రస్తుతం ఆ పది మంది ప్రోగ్రామ్​ఆఫీసర్లను ప్రధాన కార్యాలయానికే పరిమితం చేస్తూ...ఆ జిల్లాలో ఉండే డిస్ట్రిక్ట్​ఆసుపత్రి సూపరింటెండెంట్​కే డీహెచ్​క్యూఎస్​(డిస్ట్రిక్ట్ హెడ్​ క్వార్టర్​సూపరింటెండెంట్) గా అదనపు బాధ్యతలు ఇచ్చారు.అయితే ఇప్పుడు అన్ని జిల్లాల్లో డీసీహెచ్​పోస్టులను క్రియేట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed