‘నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోండి’.. DGP రవిగుప్తా కీలక పిలుపు

by Satheesh |   ( Updated:2024-05-12 09:51:54.0  )
‘నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోండి’.. DGP రవిగుప్తా కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 17 లోక్ సభ స్థానాలతో కంటోన్మెంట్ అసెంబ్లీ సీటు ఉప ఎన్నికకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. సోమవారం ఉదయం 7 గంటల నుండి రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను డీజీపీ రవిగుప్తా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

73,414 మంది పోలీసులతో ఎన్నికల బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రూ.186 కోట్ల విలువైన మద్యం, డ్రగ్స్ సీజ్ చేయడంతో పాటు 8,863 కేసులు నమోదు చేశామని వెల్లడించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రబలగాల రంగంలోకి దించామని చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా పర్యవేక్షణకు ప్రత్యేక సైబర్‌ సెక్యూరిటీ వింగ్‌ ఏర్పాటు చేశాం తెలిపారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా డీజీపీ పిలుపునిచ్చారు.

Advertisement

Next Story