- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కును ఎకో టూరిజం గా అభివృద్ధి : కొండా సురేఖ
దిశ, నర్సాపూర్ : నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కును ఎకో టూరిజం గా అభివృద్ధి చేసేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం నర్సాపూర్ హైదరాబాద్ రోడ్ లో ఉన్న అర్బన్ ఫారెస్ట్ పార్కును జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, డీఎఫ్ఓ జోజి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ ఇంచార్జ్ రాజిరెడ్డి, మెదక్ గ్రంథాలయ చైర్మన్ చిలుమల సుహాసిని రెడ్డి, నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి, తహసిల్దార్ శ్రీనివాసులతో సందర్శించి మొక్కలు నాటారు. అనంతరం అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఫారెస్ట్ ఎగ్జిబిషన్ పరిశీలించారు. సంబంధిత వివరాలను డీఎఫ్ఓ జోజిని అడిగి తెలుసుకున్నారు. వాచ్ టవర్ నుండి ఫారెస్ట్ అందాలను తిలకించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ… నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ అభివృద్ధిపరిచి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెంచి ఈ పార్కుకు ఆదాయం పెంచే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పార్కు అభివృద్ధి చేసేందుకు డి పి ఆర్ తయారు చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. నర్సాపూర్ అడవికి మంచి చరిత్ర ఉందని నిజాం కాలం నుండి ప్రాముఖ్యత చెందిన అటవీ సంపద మెదక్ జిల్లాలో ఉందన్నారు.
పర్యాటకులకు కనువిందు చేసేలా పార్కు అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. 4,300 ఎకరాలలో మెదక్ జిల్లా అటవీ విస్తీర్ణం ఉండగా 600 ఎకరాలలో నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఆఫీసర్స్ గెస్ట్ హౌస్ పర్యాటకుల కాటేజీలు రిసెప్షన్ సెంటర్స్, కిచెన్ కం స్టోరేజ్, వసతులు మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. ఈ పార్కులో చెక్ డామ్స్, రాక్ ఫీల్ డాం, 50 కిలోమీటర్ల పైపులైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
685 మీటర్ల ట్రెక్కింగ్, 700 మీటర్ల సైక్లింగ్, 50 వేల లీటర్ల వాటర్ సంప్ నిర్మాణం, ప్లాస్టిక్ రహితంగా పార్కు రూపుదిద్దుకోవడం, పార్క్ లో పిల్లలు ఆడుకోవడం కొరకు సౌకర్యాలు, మెరుగుపరుస్తున్నట్లు చెప్పారు. మెయిన్ గేట్ ప్లాజా, వాచ్ టవర్ నిర్మాణం సెమీ ప్లాంటేషన్ సెమీ మెకానికల్ 10 ఎకరాలు, ప్లాంటేషన్ లేబర్ ఇంటెన్షన్ 15 ఎకరాలు అర్బన్ పార్క్ ఏరియా కింద 42 ఎకరాలు, జిజిపి ప్లాంటేషన్ 10 ఎకరాలు, యూత్ బేరింగ్ ప్లాంటేషన్ నాలుగు ఎకరాలు, ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రొడక్షన్ టెక్చర్ ఫినిషింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాబోవు రోజుల్లో ప్రతి ఫారెస్ట్ ఎకో టూరిజం అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆలోచనకు అనుగుణంగా ముందుకు పోతున్నామన్నారు. పర్యాటకులకు ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడమే నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ గొప్పతనం అని కొనియాడారు. అటవీ , దేవాదాయ శాఖల సమన్వయంతో ఎకో టూరిజం టెంపుల్ టూరిజం అభివృద్ధి దిశగా జిల్లాను ప్రథమ స్థానం నిలుపుతామన్నారు.
నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఆదాయ వ్య యాల గురించి వివరిస్తూ రూ. 153 లక్షల 98,000 ఆదాయం సమకూరగా పార్కు అభివృద్ధికి 35 లక్షలు ఖర్చుపెటగా 18 లక్షల రూపాయలు నిల్వ ఉన్నట్టు తెలిపారు. ఇప్పటివరకు 1,12,000 మంది పర్యాటకులు సందర్శించారని చెప్పారు. కాటేజీ నిర్మాణం చేపట్టినట్లయితే పర్యాటకులు సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు. హైదరాబాద్ బొటానికల్ గార్డెన్ మాదిరిగా నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కును అభివృద్ధి చేసే దిశగా ముందుకు పోతున్నామన్నారు. ఈ అర్బన్ ఫారెస్ట్ పార్కులో ప్రకృతి రమణీయత , వృక్ష సంపద, పక్షులు జంతువులు పర్యాటకులను కనువిందు చేస్తాయన్నారు. పార్కులో సదుపాయాలు మెరుగుపరిచి పర్యాటకుల సంఖ్య పెంచి ఆహ్లాదకరమైన వాతావరణ కల్పించడమే ముఖ్య లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట పోలీస్, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఎఫ్ఆర్ఓ అరవింద్, మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లేశం, సీనియర్ నాయకులు మణిదీప్ ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.