- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అల్లు అర్జున్‌కు పరామర్శల వెల్లువ.. చంద్రబాబు, ప్రభాస్ ఫోన్

దిశ, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon star Allu Arjun)కు పరామర్శలు వెల్లువెత్తాయి. పుష్పా-2 మూవీ(Pushpa-2 Movie) రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్(Sandhya Theatre)లో జరిగిన తొక్కిసలాట కేసులో శుక్రవారం ఆయన అరెస్ట్ అయిన మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. అయితే అల్లు అర్జున్ అరెస్ట్‌ను సినీ, రాజకీయ ప్రముఖులు ఖండించారు. అల్లు అర్జున్ అరెస్ట్ దురదృష్టకరమని అంటున్నారు. అంతేకాదు ఆయనకు ఫోన్ చేసి కొందరు పరామర్శిస్తున్నారు. మరి కొందరు స్వయంగా కలిసి అల్లు అర్జున్ తామంతా అండగా ఉంటామని చెబుతున్నారు.
తాజాగా అల్లు అర్జున్‌కు ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu)తో పాటు రెబల్ స్టార్ ప్రభాస్(Rebel star Prabhas) ఫోన్ చేశారు. అరెస్ట్‌పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అటు హీరో వెంకటేశ్(hero Venkatesh) సైతం అల్లు అర్జున్‌ను కలిసి పరామర్శించారు. తాను ‘వార్-2’ సినిమా(War-2 movie) షూటింగ్‌లో ఉండటం వల్ల కలవలేకపోతున్నానని, హైదరాబాద్ వచ్చిన వెంటనే స్వయంగా వచ్చి కలుస్తానని అల్లు అర్జున్‌కు జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేశారు.