- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే
దిశ, పటాన్ చెరు : ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన నూతన డైట్ మెనూ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అనంతరం మొట్టమొదటిసారి కాస్మోటిక్, డైట్ చార్జీలను పెంచిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు. ప్రభుత్వం ఆశించిన విధంగా ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకుని విద్యను అభ్యసించాలని కోరారు. ప్రతి ఏటా ఒక్కో విద్యార్థిపై లక్ష రూపాయల పైగా ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా గురుకుల పాఠశాలను ప్రభుత్వం బలోపేతం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి దేవూజ, పాఠశాల ప్రిన్సిపాల్ శోభారాణి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.