Kannappa: ‘కన్నప్ప’ నుంచి బిగ్ అప్డేట్.. లెజెండరీ హీరో గ్లింప్స్ రాబోతున్నాయంటూ ట్వీట్

by Hamsa |
Kannappa: ‘కన్నప్ప’ నుంచి బిగ్ అప్డేట్.. లెజెండరీ హీరో గ్లింప్స్ రాబోతున్నాయంటూ ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘కన్నప్ప’(Kannappa). ఈ మూవీకి ముఖేష్ కుమార్(Mukesh Kumar) దర్శకత్వం వహిస్తుండగా.. ఎవా ఎంటర్‌టైన్‌మెంట్స్(AVA Entertainment), 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై మంచు మోహన్ బాబు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే ఇందులో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబు(Mohan Babu), శరత్ కుమార్, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. అలాగే మంచు విష్ణు కొడుకు అవ్రామ్, కూతుర్లు అరియానా(Ariyaana), వివియానా (Viviana)ఈ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం.

అయితే ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 25న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో.. మూవీ మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ప్రతి సోమవారం ‘కన్నప్ప’కు సంబంధించిన అప్డేట్ ఇస్తామని ప్రకటించారు. ఇదిలా ఉంటే.. తాజాగా, మూవీ మేకర్స్ ఓ స్టార్ గ్లింప్స్ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘‘లెజెండరీ లాలెట్టన్ మోహన్ లాల్(Mohanlal) మొదటి గ్లింప్స్ వచ్చేస్తున్నాయి చూడండి. అతని అచంచలమైన అంకితభావం, విశేషమైన వర్ణన ఈ పవిత్ర కథకు జీవం పోసింది. డిసెంబర్ 16, సోమవారం పూర్తి లుక్ రివీల్ కోసం చూస్తూనే ఉండండి’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం మేకర్స్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

Next Story